
కావలసిన పదార్దాలు:
కొబ్బరి పాలు : కప్పు
బియ్యప్పిండి : కప్పు
వేయించిన మినపప్పు : అర కప్పు
నువ్వులు : టేబుల్ స్పూన్
జీలకర్ర : టేబుల్ స్పూన్
సోంపు : టేబుల్ స్పూన్
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
కరిగించిన నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
వంటసోడా : అర టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడ
తయారుచేయు విధానం :
1) ముందుగా మినప్పప్పును మిక్సిలో వేసి మెత్తగా పిండిలా గ్రైండ్ చెయ్యాలి.
2) ఒక గిన్నెలో మిక్సి పట్టిన మినప్పిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, సోంపు, జీలకర్ర, నువ్వులు, వంటసోడా, కరిగించిన వెన్న వేసి కలపాలి.
3) ఇప్పుడు కొబ్బరి పాలు పోస్తూ ముద్దలా కలపాలి.
4) స్టవ్ ఫై నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత కలిపిన పిండి ముద్దను కోద్దిగా తీసుకోని జంతికల గొట్టం లో పెట్టి కాగే నూనెలోజంతికలా నొక్కాలి.(వెయ్యాలి.)
5) వీటిని ఎర్రగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే కొబ్బరి జంతికలు రెడీ.