ఉసిరి తొక్కు పచ్చడి (Amla Pickle in telugu Usirikaya Pachchadi)


కావలసిన పదార్దాలు :

ఉసిరికాయలు : కేజీ 
ఉప్పు : తగినంత 
పండు మిర్చి :పావుకేజీ 


తయారుచేయు విధానం :

1) ఉసిరికాయలు  కడిగి తుడిచి రెండు రోజులు ఆర బెట్టాలి.
2) తరువాత కచ్చాపచ్చాగా దంచి, గింజలు తీసి ఒక సీసాలో పెట్టి మూడు రోజులు పక్కన పెట్టాలి.
3) తరువాత ఈ ఉసిరి ముక్కలకు ఉప్పు, పండు మిర్చి కలిపి మెత్తగా దంచి  ఈ ముద్దను గాలి వెళ్ళకుండా ఉండే సీసాలో పెట్టి గట్టిగా మూత పెట్టాలి.
4) మనకు కావాలనుకున్నప్పుడల్లా  కొద్ది కొద్దిగా తీసుకోని పోపు పెట్టుకొని వాడుకోవచ్చు.