కావలసిన పదార్దాలు:
చికెన్ : అర కిలో
ములక్కాడలు : మూడు
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : మూడు
కారం : రెండు టీ స్పూన్లు
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
గరం మసాలా : టీ స్పూన్
టమాటా ప్యూరి : పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
కొత్తిమీర : కట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేయు విధానం:
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో శుబ్రం చేసిన చికెన్,
కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మూత పెట్టి
ఉడికించాలి.
3) ప్రక్క స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.దీనిలో
ఉల్లిపేస్టు వేసి రెండు నిముషాలు వేయించాలి.
4) అది వేగాక టమాట ప్యూరి వేసి మరి కాసేపు వేయించాలి.దీనిలో
కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5) ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసి కాసేపు వేయించి గ్లాస్ నీళ్ళు
పోసి మూతపెట్టి ఉడికించాలి.
6) ఇప్పుడు చికెన్ లో నీళ్ళు పూర్తిగా యిగిరి పొడిగా అవ్వుతుంది.
దీనిని ఉడుకుతున్న ములక్కాడ ల్లో వేసి బాగా కలిపి మిగిలిన అల్లం వెల్లుల్లి
పేస్టు, గరం మసాలా,ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
7) దించేముందు కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.
