పెసరపప్పు హల్వా (Moong dal halwa in telugu Pesarapappu Halwa)

వంటపేరు : పెసరపప్పు హల్వా 


కావలసిన పదార్ధాలు :


పెసరపప్పు : కప్పు
పాలు : రెండు కప్పులు
నెయ్యి : కప్పు
యాలకులపొడి : అర టీ స్పూన్
బాదం పప్పులు : మూడు
జీడిపప్పులు : ఆరు
కిస్మిస్లు : ఆరు మిల్క్
కండెన్స్డ్ డు మిల్కు : కప్పు


తయారుచేయు విధానం :


1) పెసరపప్పుకడిగి ఒక గంట నానబెట్టాలి.
2) నానిన పప్పును మెత్తగా రుబ్బాలి. 
3) స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కాగాక, రుబ్బిన పెసరపప్పు ముద్దను 
    వేసి చిన్న మంట మీద కలుపుతూ వేపాలి. 
4) బాగా వేగిన తరువాత పాలు పోసి కలుపుతూ ఉడికించాలి.
5) పాలు యిగిరిపోయాక కండెన్స్డ్డుడు మిల్క్ వేసి కలపాలి. కాసేపటికి గట్టిపడి 
    హల్వలా తయారవుతుంది.
6) ఇప్పుడు జీడిపప్పులు, బాదాం పప్పులు, కిస్మిస్లు, యాలకులపొడి వేసి 
    కలిపి స్టవ్ ఆపాలి.
7) ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యి రాసి హల్వాని దానిలో సమానంగా సర్ది, 
    చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేయాలి.


* అంతే పెసరపప్పు హల్వా రెడి.