కొత్తిమీర పచ్చడి (Kothhimira Chutney)

వంటపేరు : కొత్తిమీర పచ్చడి


కావలసిన పదార్దములు :


కొత్తిమీర : రెండు కట్టలు
పచ్చి మిర్చి : పది
చింతపండు : తగినంత
ఉప్పు : తగినంత
జీలకర్ర : టీ స్పూన్
పోపు దినుసులు : టేబుల్ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు
కరివేపాకు : రెండు రెమ్మలు






తయారుచేయు విధానం :


కొత్తిమీర కడిగి ముక్కలుగా,కట్ చేసి పక్కన  పెట్టాలి
స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె  వేసి వేడి చెయ్యాలి. 
పచ్చిమిర్చి గాట్లు పెట్టి  నూనె లో వేపి ,వేగాక కొత్తిమీర వెయ్యాలి. 
నూనెలో కొత్తిమీర మగ్గాక స్టవ్ ఆపి వేగిన మిర్చి, కొత్తిమీర, ఉప్పు, చింతపండు, కొద్దిగ జీలకర్ర వేసి మిక్స్ చెయ్యాలి.
ఇప్పుడు పచ్చడి రెఢీ. 
మళ్లి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, కరివేపాకు, జీలకర్ర వేసి వేగాక స్టవ్ ఆపి, రెడీగా పచ్చడిని పోపులో వెయ్యాలి.


* అంతే కొత్తిమిర పచ్చడి రెడి.