స్వీట్ రైస్ (Sweet Rice Preparation in Telugu)

వంటపేరు : స్వీట్ రైస్


కావలసిన పదార్ధాలు :


బాస్మతి బియ్యం : కప్పు
పంచదార : ఒకటి న్నరకప్పు
నీళ్ళు : రెండు కప్పులు
యాలుకల పొడి : చిటికెడు
కుంకుమపువ్వు : చిటికెడు
నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష, బాదం, పిస్తా, జీడిపప్పు : అరకప్పు
(ఇంకా కావాలంటే వేసుకోవచ్చు )


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి నీళ్ళు పోసి అన్నం వండాలి. మెత్తగా కాకుండా కాస్త 
     పలుకుగా వండి ఒక ప్లేటులో వెయ్యాలి.
2) దీనిలోనే పంచదార, కుంకుమపువ్వు, ఎండిద్రాక్ష వేసి కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి బాణాని పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి. 
4) నెయ్యి వేడవగానే పంచదార కలిపిన అన్నం వేసి కలపాలి.
5) పంచదార కరిగి పాకంలా వచ్చి పలుచగా అవుతుంది. అది యిగిరిపోయే 
    వరకు ఉడికించాలి. మెత్తం తడి అంతా యిగిరిపోయాక బాదంపప్పులు, 
    జీడిపప్పులు, పిస్తా పప్పులు నేతిలో వేయించి అన్నంలో కలిపి స్టవ్ 
    ఆపాలి. 


* అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రైస్ రెడి.