స్ట్రాబెర్రీ లస్సి (Strawberry lassi in telugu)

వంటపేరు : స్ట్రాబెర్రీ లస్సి


కావలసిన పదార్ధాలు :


స్ట్రాబెర్రీ ముక్కలు : మూడు కప్పులు
పెరుగు : రెండు కప్పులు
పంచదార : ఒక కప్పు
ఉప్పు : చిటికెడు
యాలుకలపొడి : చిటికెడు
ఐసు ముక్కలు : ఒక కప్పు


తయారుచేయు విధానం :


1) మిక్సి జార్లో స్ట్రాబెర్రీలు, ఉప్పు, పంచదార, యాలుకలపొడి వేసి బాగా 
    కలిసేలా తిప్పాలి.
2) ఇప్పుడు పెరుగు వేసి మళ్లీ ఒకసారి తిప్పాలి. 
3) దీనిని గ్లాసులోకి వంచి ఐసు ముక్కలు వేసి అందించటమే.


* అంతే స్ట్రాబెర్రీ లస్సి రెడి.