సొరచేపపొడి కూర (Sorachepala podi koora / Fish Small-Pieces Curry)

వంటపేరు : సొరచేపపొడి కూర


కావలసిన పదార్ధాలు :

సొర చేప : అరకిలో
కారం : 2 టీ స్పూన్ లు
దనియాల పొడి : 1 టీ స్పూన్
జీలకర్ర పొడి, ఉప్పు : సరిపడా
కరివేపాకు : మూడు రెబ్బలు
అల్లంవెల్లుల్లి (చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి)
పసుపు : 1 టీ స్పూన్
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
గరం మసాల : 1 టీ స్పూన్
నూనె : కప్పు


తయారుచేయు విధానం :

1) సొరచేప ముక్కలు వేడి నీళ్ళల్లో వేసి పది నిముషాలు ఉంచితే, చేప మెత్త 
    బడుతుంది.
2) ఇప్పుడు చేపముక్కల మీద పొర తీసివెయ్యాలి, అలా చేసిన తరువాత 
    చేప ముక్కలు పొడిపొడిగా చిదిపి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి కాగిన తరువాత అల్లం
    ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి 
    ముక్కలు వేసి వేపాలి.
4) వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు వేసి  
    వేగాక, సిద్దం చేసిన చేపముక్కలపొడి వేసి కాసేపు వేపి గరంమసాల, 
    కొత్తిమిర వేసి కలపాలి 
   
* అంతే గుమగుమలాడే సొరచేపలపొడి కూర రెడి.