అరటికాయ బజ్జి (Aratikaaya bajji)

వంటపేరు : అరటికాయ బజ్జి

కావలసిన పదార్ధాలు :


అరటికాయ : ఒకటి (పెద్దది )
శెనగపిండి : పావుకేజీ

వామ్ము : 1 టేబుల్ స్పూన్
కారం : 1 టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : పావుకేజీ
వంటసోడా : చిటికెడు


తయారుచేయు విధానం :

1) శెనగపిండిలో ఉప్పు,కారం, వామ్ము, సోడా వేసి నీళ్ళుపోసి జారుగా బజ్జీల  
    పిండిలా కలపాలి.
2) అరటికాయను పల్చగా గుండ్రంగా కొయ్యాలి (నిలువుగాను కట్ 
    చేయోచ్చు)
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి, కాగిన తరువాత అరటికాయ 
    ముక్కని శెనగపిండిలో ముంచి, కాగే నూనెలో దోరగా వేపాలి.

* అంతే అరటికాయ బజ్జి రెడీ.

* (ఇలాగే బంగాళాదుంప, వంకాయ, వాముఆకు తో కూడా వేసుకోవచ్చు)