సాంబారు (Sambaar )

వంటపేరు : సాంబారు


కావలసిన పదార్ధాలు :


కందిపప్పు : పావుకేజీ
చింతపండు : 100g
టమాటాముక్కలు : కప్పు
బెండకాయముక్కలు : కప్పు
వంకాయముక్కలు : కప్పు (నిలువుగా కొయ్యాలి )
దోసకా య ముక్కలు : అరకప్పు
ములక్కడాముక్కలు : ఆరు
ఉల్లిముక్కలు : అరకప్పు (పెద్దవి కొయ్యాలి)
అనబకాయ ముక్కలు : ఆరు (పెద్దవి  కొయ్యాలి )
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
సాంబారు పోడి : టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి : ఆరు (నిలువుగా కట్ చ్చేయ్యాలి)
కొబ్బరి ,వెల్లుల్లి, జీలకర్ర కలిపిన  ముద్ద : 1 టేబుల్ స్పూన్  (ఇష్టమైతే బెల్లం చిన్నముక్క )
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : ఒక కట్ట
పసుపు : అర  టీ స్పూన్
తాలింపుకి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు




తయారుచేయు విధానం :


1) పప్పు కుక్కర్లో వేసి నీళ్ళుపోసి ఆరు విజిల్సు రానివ్వాలి.
2) ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేరే గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి 
    ఉడకనివ్వాలి.
3) ఇప్పుడు పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కొబ్బరి, వెల్లుల్లి, జీరా  
    పేస్టూ, బెల్లం, కొత్తిమిర కొద్దిగా వేసి, మెత్తగా వుడికిన పప్పు కూడా వేసి 
    కలిపి, చింతపండు పులుసు వేసి పది నిముషాలు మరగబెట్టాలి.
4) సాంబారు పొడి వేస్తే, మరిగి మంచి వాసన వస్తుంది.
5) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, 
    వెల్లుల్లి వేసి వేగాక, సాంబారులో కొత్తిమిర కూడా వేసి మూతపెట్టాలి.


* అంతే ఘుమఘుమలాడే   సాంబార్ రెడి.