రొయ్యలు ఫ్రైడ్ రైసు (Prawns Fried Rice in Telugu)

వంటపేరు : రొయ్యలు ఫ్రైడ్ రైసు


కావలసిన పదార్ధాలు :


రొయ్యలు : చిన్నవి అరకిలో
బాస్మతి బియ్యం : అరకిలో
గుడ్లు : రెండు
నూనె : 1 కప్పు
కేరెట్ ముక్కలు : అరకప్పు
బీన్సు ముక్కలు : అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు : 
మిరియాల పొడి : అర టీ స్పూన్ప
పచ్చిమిర్చి ముద్ద : 1 టేబుల్ స్పూన్ 
అల్లం వెల్లుల్లి ముద్ద : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
పసుపు : అర టీ స్పూన్
పచ్చి బటాని : అరకప్పు
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొత్తిమిర : 1 కట్ట
సోయా సాస్ : 1 టీ స్పూన్




తయారుచేయు విధానం :


1) గుడ్లు పగలగొట్టి కాస్త ఉప్పు, మిరియాల పొడి కలిపి పక్కన పెట్టాలి
2) పచ్చి బటాని, బీన్సు, కేరెట్ ముక్కలు ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరుపోసి 
    స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి.
3) గుడ్డు సొనను పొరుటులా వేసి పక్కన పెట్టాలి.
4) రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి కొద్దిగా నీరుపోసి ఉడకపెట్టి 
    పక్కన పెట్టాలి
5) ఇప్పుడు బియ్యం కడిగి అన్నం కాస్త పదునుగా వండి పక్కనపెట్టాలి. 
6) ఇప్పుడు కళాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి ముక్కలు వేసి వేగిన 
    తరువాత అల్లంవెల్లుల్లి వేసి పచ్చి వాసనా పోయే వరకు వేపి తరువాత  
    ఉడకబెట్టిన రొయ్యలు వేసి వేపాలి.
7) కాస్త వేగాక పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి, ఇప్పుడు ఉప్పు, మిరియాల 
   పొడి, సోయాసాస్, కేరెట్ ముక్కలు, బీన్సు ముక్కలు, పచ్చ బటాని వేసి 
   కొద్దిగా వేపి ఉడికిన అన్నం వేసి కలిపి, గుడ్డు పోరుటుకూడా వేసి 
   బాగాకలిపి కొత్తిమిర జల్లి స్టవ్ ఆపాలి.


* అంతే రొయ్యల ఫ్రైడ్ రైసు రెడి.