మసాల మజ్జిగ (Spiced Buttermilk in telugu Masala Majjiga)

వంటపేరు : మసాల మజ్జిగ 


కావలసిన పదార్ధాలు :


పెరుగు : ఒక,గ్లాసు .
పచ్చిమిర్చి : ముక్కలు టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం ముక్కలు : టీ స్పూన్
కొత్తిమిర తురుము : టీ స్పూన్
లేత కరివేపాకు ముక్కలు : కొద్దిగా
జీలకర్ర పొడి : చిటికెడు
శొంటిపొడి : చిటికెడు


తయారుచేయు విధానం 


1) పెరుగును మెత్తగా చిలికి నీళ్ళువేసి మజ్జిగాలా చెయ్యాలి.
2) దానిలో మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమిర తురుము, కరివేపాకు 
    ముక్కలు, జీరా పొడి, శొంటి పొడి, ఉప్పు వేసి గరిటతో బాగా కలపాలి.  
3) పావుగంట తరువాత త్రాగితే చాలా బాగుంటుంది.


* ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
* అంతే మసాల మజ్జిగ రెడి.