ఖర్జురాలు, వేరుసెనగపప్పు లడ్డు (Dates laddu in telugu Karzooram, Senagapappu Laddu)

వంటపేరు : ఖర్జురాలు, వేరుసెనగపప్పు లడ్డు 


కావలసిన పదార్ధాలు : 


ఖర్జూరం : పావుకేజీ
వేరుసెనగ పప్పులు : పావుకేజీ


తయారుచేయు విధానం :


1) వేరుసెనగ పప్పులు దోరగా వేపి పొట్టు తియ్యాలి, ఖర్జూరాలు గింజలు 
    తియ్యాలి.
2) ఇప్పుడు వేరుసెనగ పప్పులు మిక్సిలో వేసి ఒకసారి తిరిగాక, ఖర్జూరాలు   
    వేసి ఒకసారి మిక్స్ చేశాక ఆపాలి.
3) ఇప్పుడు మిక్సి జార్ లో నుండి తీసి ఉండలు చుట్టుకోవాలి.


* అంతే ఖర్జురపు ఉండలు రెడి.
* ఇవి పిల్లలకు చాలా బలవర్దక మైనవి.