చిక్కుడుకాయ వేపుడు (Broad Beans Fry in telugu Chikkudukaya Vepudu)

కావలసిన పదార్దములు :


చిక్కుడు కాయలు : పావుకేజీ
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఎండిమిర్చి: రెండు
వెల్లుల్లి : రెబ్బలు ఆరు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె  : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
పచ్చిమిర్చి పేస్టు : 1 టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) చిక్కుడు కాయలు ముక్కలుగా చేసి కడగాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
3) నూనె కాగాక పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి 
    వేసి వేగాక పసుపు వేసి కలిపి, చిక్కుడు ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు వేసి 
    ఒకసారి కలిపి మూత పెట్టాలి.
4) చిన్న మంటమీద పది నిముషాలు వేగనివ్వాలి. మధ్యమధ్యలో 
    కలుపుతూ ఉండాలి.
5) ఆవిరికి చిక్కుడు ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి కారం, 
    ఉప్పువేసి కలిపి, రెండు నిముషాలు వేగనిచ్చి, తడి పోయాక స్టవ్ ఆపాలి. 
    (ఉప్పు, కారం వేసాక మూత పెట్టకూడదు)


* అంతే చిక్కుడుకాయల వేపుడు రెడి.