పుచ్చకాయ జూస్ (Water Melon Juice / Puchchakaaya Juice)

కావలసిన పదార్ధాలు :

పుచ్చకాయ : అరకిలో
తేనె : రెండు టేబుల్ స్పూన్ లు
నిమ్మరసం : 1 టీ స్పూన్
కమలా ఫలాలు : మూడు 
అల్లం : చిన్న ముక్క

తయారుచేయు విధానం :

1) పుచ్చకాయ చెక్కు తీసి, గింజలు లేకుండా ముక్కలు కొయ్యాలి.
2) కమలా ఫలాల నుండి రసం తీసి సిద్దంగా ఉంచుకోవాలి.
3) ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు, కమలారసం, అల్లం ముక్క జూసర్లో వేసి 
    తిప్పాలి. 
4) వచ్చిన జూస్ లో తేనే, నిమ్మరసం వేసి కలపాలి.

* అంతే పుచ్చకాయ జూస్ రెడి.