చికెన్ కూర (Chicken Curry / Kodi Koora)

కావలసిన పదార్ధాలు :

చికెన్ : 1 కిలో 
ఉల్లిపాయలు : రెండు 
టమాటాలు : మూడు
దాల్చిన చెక్క : రెండు అంగుళాలు
యాలకులు : నాలుగు
మిరియాలు : మూడు
గరం మసాల : 1 టేబుల్ స్పూన్
సాజిరా : 1 టీ స్పూన్
అల్లంవెల్లుల్లి : 1 టేబుల్ స్పూన్
కారం : 1 టేబుల్ స్పూన్
పెరుగు : 1 కప్పు 
నిమ్మరసం : 1 టేబుల్ స్పూన్ 
కొత్తిమిర : 1 కట్ట
పచ్చిమిర్చి : ఆరు 
నూనె  : 100  గ్రాములు
ఉప్పు : సరిపడ


తయారుచేయు విధానం :

1) చికెన్ బాగా కడిగి అల్లంవెల్లుల్లి, కొత్తిమిర, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు 
    వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేయ్యాలి. కాగిన తరువాత 
    ఉల్లి ముక్కలు వేసి దోరగా వేపాలి.
3) వేగిన తరువాత చెక్క, మిరియాలు, సాజిరా, యాలకులు, లవంగాలు,  
    ఉప్పు, కారం వేసి ఒకసారి కలిపి టమాటాలు వేసి ఉడికించాలి.
4) అవి మెత్తపడ్డాక చికెన్ ముక్కలు వేసి, కలిపి మూత పెట్టాలి.
5) ఒక నిముషం వుంచి పెరుగు వేసి కలిపి, మూతపెట్టి పది నిముషాలు 
    ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు మూతతీసి కూర దగ్గర పడ్డాక పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమిర, 
    గరం మసాల వేసి ఒకసారి కలిపి, నిమ్మరసం పిండి మూత పెట్టి స్టవ్ 
    ఆపాలి.

* అంతే గుమగుమలాడే చికెన్ కర్రి రెడి.