అరిసెలు (Ariselu)

కావలసిన పదార్ధాలు :

బియ్యం : కేజీ
బెల్లం : అరకేజీ
నువ్వులు  : 100 గ్రాములు    
మజ్జిగ : అరకప్పు
నూనె : కేజీ
నెయ్యి : కప్పు


తయారుచేయు విధానం :

1) బియ్యం ఒకరోజు ముందు నానపెట్టాలి.
2) మరుసటి రోజున బియ్యం వడపోసి నీళ్ళుపోయాక దంచి పిండి రెడి 
    చేసుకోవాలి
3) స్టవ్ వెలిగించి పాత్రలో బెల్లం చిదగకొట్టి కొద్దిగా నీళ్ళు పోసి పాకం పట్టాలి.
(పాకం వచ్చింది లేనిది తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం పాకాన్ని నీటిలో వేసి వేళ్ళతో తీస్తే వుండగా వస్తుంది) 
4) అలావస్తే పాకం వచ్చినట్టే, ఇప్పుడు రెడీచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా పోసి కలపాలి గరిటతో తీస్తే ముద్దలా వస్తుంది.
5) స్టవ్ పై బాండిలో నూనెపోసి కాగనివ్వాలి. ఇప్పుడు మజ్జిగలో నువ్వులు 
    కలపాలి
6) పెద్దనిమ్మకాయంత పిండిని చేతులోకి తీసుకోని మజ్జిగతో కలిపిన 
    నువ్వుల్లో దోర్లిచి  ప్లాస్టిక్ కవరు మీద అరిసెల వత్తి, కాగే నూనెలో తిరగేస్తూ 
    వేగనివ్వాలి. ఇప్పుడు తీసి జల్లెడలాంటి గిన్నెలో వెయ్యాలి.
7) అరిసెలు వేసిన గిన్నెను వేరే  లోతుగిన్నేమిద పెడితే అరిసేలలో వున్న 
    నూనె క్రింది గిన్నెలోకి దిగిపోతుంది. ఇప్పుడు అరిసెలు వేరే డబ్బాలో 
    పెట్టుకోవాలి  


* అంతే రుచికరమైన నువ్వుల అరిసెలు రెడి. 
   ఇవి నెల రోజులు నిల్వ వుంటాయి.