టమాట రసం (Tomato Rasam Preparation)

కావలసిన పదార్ధాలు :

టమాటాలు : రెండు
చింతపండు : నిమ్మకాయంత
మిరియాలపొడి : టి స్పూన్ 
ఉప్పు : సరిపడా
పసుపు : టి స్పూన్
కొత్తిమిర : చిన్నకట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : కొంచెం 
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు


తయారు చేయు  విధానం :

టమాటాలు వేడి నీటిలో వేసి రెండు నిముషాలు ఉంచాలి, అవి మెత్తబడతే అదే నీటిలో చింతపండు వేసి, పసుపు, ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి, ఇవన్నీ కలిపిన గిన్నెను స్టవ్ మీద పెట్టి పది నిముషాలు మరగబెట్టి దించాలి. ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, మరగపెట్టిన టమాట రసం తాలింపు వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి. అంతే టమాట రసం రెడి.