ఇడ్లీ (How to prepare Idly)





కావలసిన పదార్ధాలు :

మినప పప్పు : పావు కేజీ
ఇడ్లీరవ్వ : అర కేజీ
ఉప్పు : తగినంత


తయారు చేయు విధానం :

రేపు ఉదయం ఇడ్లీ వండాలి అంటే. మనం ఈరోజు రెడి చేసుకోవాలి. మినపప్పును మూడు గంటలు నానపెట్టిన తరువాత మెత్తగా రుబ్బాలి. రవ్వను నీటిలో వేసి గంట నానబెట్టాలి. ఇప్పుడు రవ్వను మూడు సార్లు  బాగా కడిగి నీటిని పిండి, రుబ్బిన పిండిలో వేసి ఉప్పు కలపాలి ఇదిరాత్రి పులిసి పొంగుతుంది. మనం ఇడ్లీ వేసే ముందు బాగా కలిపి ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళుపోసి ఇడ్లీ రేకుల్లో కొంచెం కొంచెం పిండి ఇడ్లీలా వేసి నీళ్ళు పోసిన పాత్రలో పెట్టి మూతపెట్టాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ పాత్ర పెట్టి పావు గంట వుడకనివ్వాలి. అంతే వేడివేడి ఇడ్లీ రెడి.