పాల అన్నం (Sweet Rice / Pala Annam)

కావలసిన పదార్ధాలు :

బియ్యం : పావుకేజీ
పాలు : 1 లీటరు
బెల్లం : పావుకేజీ (తీపి కావాలంటే )
యాలకులు : మూడు (పొడి చేసుకోవాలి)
జీడిపప్పులు : కొన్ని
సగ్గుబియ్యం : అరకప్పు

తయారు చేయు విధానం :

1) స్టవ్ వెలిగించి పాలు వేడిచేయ్యాలి.
2) బియ్యం కడిగి నానబెట్టాలి.
3) పాలు బాగా మరిగిన తరువాత, సగ్గుబియ్యం వేసి కొద్దిగా ఉడికిన తరువాత
  బియ్యం వేసి ఉడకనివ్వాలి.
4) పాలు, బియ్యం బాగా ఉడికిన తరువాత బెల్లం కోరు వేసి కలపాలి.
5) ఇప్పుడు అన్నం ఉడికి చిక్కగా అయ్యాక నేతిలో వేపిన జీడిపప్పులు, 
  యాలుకలపొడి వేసి కలిపి మూతపెట్టి స్టవ్ ఆపాలి.