బంగాళాదుంపల వేపుడు (Bangaladumpala Vepudu / Aloo Fry)

కావలసిన పదార్ధాలు :


బంగాళా దుంపలు : పావుకేజీ
పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్ (మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, ఎండిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర) కరివేపాకు : కొద్దిగా
పసుపు : 1 టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : టేబుల్ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా




తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి బంగాళదుంపలు ఉడకబెట్టాలి.
2) ఉడికిన దుంపల పొట్టుతీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు కళాయిలో నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగనివ్వాలి.
4) వేగిన తరువాత కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, బంగాళా 
    దుంప ముక్కలు వేసి కలపాలి.
5) ఒక నిముషం వేగిన తరువాత స్టవ్ ఆపి కొత్తిమిర జల్లి వడ్డించాలి.