పెసర ఇడ్లి (Pesara Idly)

కావలసిన పదార్ధాలు :

పెసలు : పావుకేజీ
రవ్వ : పావుకేజీ
పెరుగు : 1 కప్పు
మిరియాలు : 1 టీ స్పూన్
కేరెట్లు : రెండు
వంటసోడా : చిటికెడు
ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం :

1) పెసలు రెండు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బాలి.
2) దీనిలో రవ్వకడిగి, రుబ్బిన పిండిలో వేసి ఉప్పు, పెరుగు కలిపి 
    మూతపెట్టి ఒక గంట పక్కన ఉంచితే పొంగుతుంది.
3) దీనిలో కేరెట్ తురుము, మిరియాలపొడి, సోడా బాగా కలిపి ఇడ్లి రేకులో 
    ఇడ్లి లావేసి స్టవ్ మిద పెట్టి ఉడకనివ్వాలి.