సెనగపప్పు వడలు (Senagapappu Vadalu)

కావలసిన పదార్ధాలు :


పచ్చిసెనగపప్పు : పావుకేజీ పచ్చిమిర్చి : మూడు
ఉల్లిపాయలు : మూడు 
(చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
ఉప్పు : కొద్దిగా 
కొత్తిమిర : కొద్దిగా 
అల్లం : చిన్నముక్క
వంటసోడా : చిటికెడు
నూనె : పావు కేజీ


తయారుచేయు విధానం :


1) మూడు గంటల ముందు సెనగపప్పును నానబెట్టాలి.
2) ఇప్పుడు నానిన పప్పును గట్టిగా రుబ్బాలి.
    (మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పప్పులు ఉండేలా రుబ్బాలి)
3) అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమిర, ఉప్పు కలిపి కొద్దిగా దంచి, రుబ్బిన 
    పిండిలో వేసి ఉల్లి ముక్కలు, వంటసోడా  కూడా కలిపి ఉంచాలి. 
4) నూనె వేడి చేసి, సిద్దం చేసిన పిండిని కొంచెం చేతిలోకి తీసుకోని అరచేతిలో 
    వడలా ఒత్తి కాగే నూనెలో వేసి దోరగా వేపాలి.
5) అలా రెండు ప్రక్కల వేగాక, టిస్యుపేపర్ పరచిన ప్లేటులోకి తీసుకోవాలి.


* అంతే రుచిగా వుండే సెనగపప్పు వడలు రెడి.