రసగుల్లా (Preparation of Rasgulla)

కావలసిన పదార్ధాలు :

పాలు : 1 లీటరు 
పంచదార : అరకేజీ (500 grms)
రవ్వ: ఒక చమ్చా (1 Table Spoon)




తయారుచేయు విధానం :

పాలు కాచి, వాటిలో నిమ్మరసం పిండి పాలు విరగ గొట్టాలి. అలా విరిగిన పాలని ఒక పలుచని బట్టలో కట్టి వడకట్టాలి. అలా అరగంట చేస్తే పాల విరుగుడులోని నీరంతా పోతుంది, తరువాత పాలముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని పాలముద్దని మరియు రవ్వని చేతితో బాగా కలపాలి.  అలా కలిపాక మూడు గంటలు వుంచాలి. 


మూడు గంటలు గడిచిన తరువాత పంచదారను రెండు భాగాలుగా చేసి ఒక భాగం స్టవ్ మీదపెట్టి కొద్దిగా నీరుపోసి పాకం రానివ్వాలి, పాల విరుగుడుని చేతితో తిసుకోని కలిపి చిన్నచిన్న ఉండలుగా  చేసి, పాకం ముదురుపాకం వచ్చాక పాలవిరుగుడు వుండలు పాకంలోవేసి ఉడకనివ్వాలి. తరువాత మిగిలిన పంచాదారను వేరే వెడల్పు గిన్నెలో లేతపాకం పట్టాలి. ఇప్పుడు వుడికిన ఉండలు తీసి లేతపాకములో వేసి పది నిముషాలు ఉంచాలి. కాసేపటికి పాకం పీల్చుకొని రసగుల్లలు రెడీ అవుతాయి.