చికెన్ జీడిపప్పు కర్రి (Cashew / Jeedipappu Chicken Curry)

కావలసిన పదార్ధాలు :

చికెన్ : అరకేజీ
ఉల్లిపాయలు : పెద్దవి రెండు 
పచ్చిమిర్చి : నాలుగు 
అల్లంవెల్లుల్లి ముద్ద : రెండు చెమ్చాలు
గరం మసాలా : రెండు చెమ్చాలు
కారం : రెండు పెద్ద చెమ్చాలు
ఉప్పు : సరిపడినంత
పెరుగు : అరకప్పు
నూనే : సరిపడినంత
కొత్తిమిర : 1 కట్ట 
కరివేపాకు : మూడు రెమ్మలు 
గసగసాలు ముద్ద : రెండు చెమ్చాలు
జీడిపప్పు : వంద గ్రా (రెండు గంటల ముందుగా నానపెట్టాలి)



తయారు చేయు విధానం :


చికెన్ కడిగి దానిలో కారం, ఉప్పు, అల్లం-వెల్లుల్లి, పెరుగు, కొత్తిమిరా వేసి కలిపి అరగంట పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పానుపై నూనె వేసి వేడిచేయాలి, ఇప్పుడు కాగిన నూనెలో ఉల్లిముక్కలు వేసి వేగనివ్వాలి.  తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి, ఇప్పుడు చికెన్ వేసి మూత  పెట్టాలి, పది నిముషాలు వుడికిన తరువాత మూతతీసి ఒకసారి కలిపి నానపెట్టిన జీడిపప్పులు, పచిమిర్చి వేసి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.  ఇప్పుడు మూతతీసి గసగాసాల ముద్ద వేసి, ఒకసారి కలిపి ఒక నిముషం  ఉంచి గరంమసాల, కొత్తిమిర వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి. అంతే చికెన్ జీడిపప్పు కర్రి రెడి.