కేకు (How to bake a home-made Cake)

కావలసిన పదార్దాలు :

మైదా : పావుకేజి
పంచదార : పావుకేజీ
గుడ్లు : అరడజను (6)
రిఫయిండు ఆయిల్ : 100 గ్రాములు
యసేన్స్ : కొద్దిగా
బేకింగ్ సోడా :  2 చేమ్చాలు
వెన్న: అరకప్పు
పంచదార పొడి : అరకప్పు

తయారు చేయు విధానం :

ముందుగా ఒక గిన్నెలో మైదా మరియు బేకింగ్ సోడని జల్లించి పక్కనపెట్టాలి, తరువాత పంచదారని మిక్సిలో వేసి పొడిచేయాలి. దీనిని గిన్నెలో ఉంచిన  మైదాలో కలిపి, గుడ్లు పగలగొట్టి ఎగ్ బీటరతో బాగా నురుగువచ్చేలా బీట్  చేయాలి. ఇప్పుడు మైదా పంచదార పొడి, గుడ్లు,  నూనె, యసెన్సి వేసి బాగా కలిపి కేకుగిన్నేలో వేసి, స్టవ్ మీద మందపాటి అట్టలరేకుపెట్టి దానిమీద ఇసుకపోసి దానిమీద కేకుగిన్నే పెట్టాలి. స్టౌ ని చిన్న మంటమీద నలబై  నిముషాలు ఉంచితే కేకు రెడి అవుతుంది.


క్రీమ్ తయారి :

వెన్న మరియు పంచదారపొడి బాగాకలిపి క్రీములా చేసి, రెడీగా వున్న కేకుపై వేసి కేకు మొత్తం పుయాలి. ఇప్పుడు తినటానికి కేకు రెడి.