మైదా బిస్కెట్లు (Preparation of Round-shaped Maida Biscuits)

కావలసిన పదార్ధాలు :


మైదా : అరకేజీ
వెన్న : 100 గ్రాములు  
నెయ్యి : 100  గ్రాములు 
పంచదార : పావు కేజీ
ఉప్పు : చిటికెడు


తయారు చేయు విధానం :


ఒక గిన్నెలో మైదా, వెన్న, నెయ్యి, పంచదార, ఉప్పు  వేసి బాగా కలిపాలి. ఇలా తయారైన మిశ్రమంలో కొద్దిగా పాలుపోసి చెపాతిముద్దలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లారేకుపై ఇసుక పోసి మందంగా రేకంత సర్దాలి. ఇప్పుడు నానిన పిండిని చెపాతిలా చేసి  అంచు లేని గ్లాసుతో చెపాతి మిద నొక్కితే గుండ్రంగా కట్ అయ్యి వస్తాయి, అలా అన్ని చేసుకున్నాక వేరే మందంగా వున్నా మరో అట్లరేకు తీసుకోని దానిమీద కట్ చేసిన బిస్కెట్లు ఒకొక్కటిగా సర్ది స్టవ్ మీద వున్న అట్లరేకుఫై వున్న ఇసుకఫై  పెట్టాలి. ఇసుక వేడికి ఫైనవున్న బిస్కట్స్ తయారు అవుతాయి, ఇలా రెండు నిముషాలు గడిచిన తరువాత బిస్కట్స్ని మరో వైపుతిప్పాలి. ఐయిదు నిముషాలకు బిస్కెట్స్ తయారయ్. ఇవి నెల రోజులు నిల్వ వుంటాయి (  హాట్ కావాలంటే పంచదారకు బదులు ఉప్పు వేసుకుంటే సరి ).