చేపముక్కలు : అర కేజీ
కారం : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి ముద్ద : ఒక స్పూన్
అల్లం-వెల్లుల్లి ముద్ద : ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : 1 టీ.స్పూన్
పసుపు : 1 టీ.స్పూన్
నిమ్మకాయ : ఒకటి
కొత్తిమిర : 1 కట్ట
కొత్తిమిర : 1 కట్ట
గరం మసాల : 1 టి.స్పూన్
నూనె : పావు కేజీ
నూనె : పావు కేజీ
తయారుచేయు విధానం :
చేపముక్కలు బాగా కడిగి నీరు లేకుండా చేసి, వీటిలో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, నిమ్మరసం కలిపి అరగంట పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత చేపముక్కలు ఒకొక్కటిగా కాగిన నూనెలో వేసి బాగా వేగిన తరువాత మిగిలిన నూనెను వేరే గిన్నెలోకి వంచి, మరల ఇప్పుడు వేపిన ముక్కలన్నీ బాండిలో వేసి గరంమసాల కలిపి కొత్తిమిర జల్లాలి. అంతే చేపల వేపుడు రెడి.
