కావలసిన పదార్ధాలు :
మైదా : కేజీ
పంచదార : కేజీ
నూనె : కేజీ
నెయ్యి : 100 గ్రాములు
వంటసోడా : 1 టి.స్పూన్
తయారు చేయు విధానం :
మైదాని జల్లించి దానిలో నెయ్యి, సోడా, ఉప్పు వేసి పూరి పిండిలా కలిపి ఒకగంట నాననివ్వాలి. గంట తరువాత పిండిని ఉండలుగా చేసి పల్చని చపాతీలా చేసి దానిపై నెయ్యి రాసి పేపర్ రోల్లాగ చుట్టాలి. ఇలా అన్నీ చుట్టి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నొక్కి పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి, నూనె కాగిన తరువాత కట్ చేసిన కాజాలను వేసి వేగనివ్వాలి. అవి వేగెలోపు పంచదారలో తగినన్ని నీళ్ళుపోసి మరో స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలి. కాస్త ముదురు పాకం రాగానే దోరగా వేగిన కాజాలను వేసి బాగాకలిపి ప్లేటులోకి తీసుకోవాలి. అంతే కాజాలు రెడి.
