కావలసిన పదార్ధాలు :
పొట్టు పెసరపప్పు : పావుకేజీ
ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర అన్ని కలిపి : ఒక కప్పు
నూనె : 1 కప్పు
కొత్తిమిర : కొద్దిగా
ఉప్పు : సరిపడ
కొత్తిమిర : కొద్దిగా
ఉప్పు : సరిపడ
తయారుచేయు విధానం :
పెసరపప్పుని ఒక పూట నానబెట్టి ఉంచి, ఉదయం పెసరపప్పును కడిగి మెత్తగా రుబ్బాలి. దీనిలో సరిపడా ఉప్పు కలిపి రెండు నిముషాలు పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని లోతుగరిటతో తీసి పాన్ మీద వేసి గుండ్రంగా దోసలా తిప్పాలి. ఇప్పుడు అన్ని కలిపిన ఉల్లి ముక్కలు కొద్దిగా తీసుకొని పైన జల్లాలి, స్పూన్ తో నూనె తీసి పెసరట్టు మీద చుట్టూ వేసి అట్టు కాలిన తరువాత అట్ల కాడతో తిరగేసి మళ్ళీ నూనె వేసి దోరగా కాలిన తరువాత పెసరట్టులో ఉప్మా పెట్టి ప్లేటు లోకి తీసుకోవాలి. అంతే గుమగుమలాడే పెసరట్టు ఉప్మా రెడి.
గమనిక : ఇష్టంలేనివాళ్ళు ఉప్మా లేకుండా తినొచ్చు. దీనిలోకి అల్లం పచ్చడి గాని, టమాట పచ్చడి గాని బాగుంటుంది.