కేరెట్ స్వీట్ (Carrot Sweet)

కావలసిన పదార్ధాలు :

పాలు : 1 లీటరు
కేరెట్ : పెద్దవి నాలుగు
వెనిల కస్టర్ పౌడర్ : 2 టేబుల్ స్పూన్ లు
పంచదార : పావుకిలో
యాలుకలపొడి : 1 స్పూన్
జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ : అరకప్పు


తయారుచేయు విధానం : 

కేరెట్ చెక్కుతీసి తురిమి పక్కనపెట్టాలి. కిస్మిస్ని నీళ్ళలో వేసి నానపెట్టాలి. ఒక గిన్నెలో కేరెట్ తురుము, పంచదార వేసి స్టవ్ మీద పెట్టి, చిన్న మంటపై ఉంచి కలుపుతూ వుండాలి. పంచదార కరిగి కేరెట్ పొడిగా అయిన తరువాత అరలీటరు పాలుపోసి నానపెట్టిన కిస్మిస్ వేసి వుడకనివ్వాలి. అలా ఉడుకుతున్నప్పుడు మిగిలిన పాలల్లో వెనిలా కస్టర్డ్పుపొడి కలిపి ఉడుకుతున్న కేరెట్లో వేసి కలపాలి. రెండు నిముషాల్లో చిక్కగా అవుతుంది ఇప్పుడుస్టవ్ ఆపి, కేరెట్ మిశ్రమాన్ని గాజు గిన్నెలో పోసి పిస్తా, జీడిపప్పు, యాలుకలపొడి కలిపి చాల్లరిచ్చి ఫ్రిజులో పెట్టాలి.