చింతపండు పులిహోర (Chintapandu Pulihora / Tamarind Instant Rice)

కావాలసిన పదార్ధాలు :

బియ్యం : అరకిలో
నూనె : 1 కప్పు
చింత పండు గుజ్జు : 1 కప్పు
పోపు దినుసులు : అరకప్పు
అంటే (ఆవాలు, మినపప్పు, సెనగపప్పు,వేరు సెనగ పప్పులు)
ఎండుమిర్చి : నాలుగు
కరివేపాకు : మూడు రెమ్మలు
పచ్చిమిర్చి : మూడు
పసుపు : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
ఆవపిండి ముద్ద : 1 టేబుల్ స్పూన్
(కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)


తయారుచేయు విధానం :

1) ముందుగా అన్నం పొడిపొడిగా వండి ప్లేటు లోకి తీసి చల్లార్చాలి.  
2) ఇప్పుడు చింత పండు నానపెట్టి, గుజ్జు తియ్యాలి.
3) దీనిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి స్టవ్ మీద పెట్టి 
    ఉడకపెట్టాలి. ఇది దగ్గరగా ఉడికి ముద్దలా వస్తుంది దీనిని దించి పక్కన 
    పెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ పై బాండిపెట్టి నూనెపోసి పోపుదినుసులు వేసి వేగాక,
    ఎండుమిర్చి వేసి వేగిన తరువాత కరివేపాకు వేసి స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు అన్నంలో ఉడకబెట్టిన చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి.
6) అన్నమంతా కలిసిన తరువాత, వేగిన పోపు వేసి అన్నం మొత్తం కలపాలి.


*  అంతే చింతపండు పులిహోర రెడి.