శెనగపప్పు జంతికలు (Preparation of Jantikalu / Murugulu)

కావలసిన పదార్ధాలు : 

బియ్యంపిండి : అరకేజీ
శెనగపప్పు : పావుకేజీ
వామ్ము : 100  గ్రాములు
నువ్వులు : 100  గ్రాములు
ఉప్పు, కారం : తగినంత 
నూనె : అరకేజీ


తయారు చేయు విధానం :

ముందుగ స్టవ్ వెలిగించి కుక్కర్లో కడిగిన సెనగపప్పు, తగినంత నీరు పోసి మూతపెట్టి నాలుగు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి. ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయాక మూతతీసి మెత్తగా ఉడికిన  పప్పులో బియ్యంపిండి వేసి, వామ్ము, నువ్వులు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి (కావలిస్తే కొంచెం నీరుపోసి ముద్దలా కలపాలి). ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేసి కాగనివ్వాలి, జంతికల గొట్టంలో తయారు చేసుకున్న పిండిపెట్టి కాగిన నూనెలో జంతికల ఆకారంలో వేసి, వేగిన తరువాత తీయాలి. (చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి). అంతే శెనగపప్పు జంతికలు రెడి.