అల్లం : పావు కేజీ
బెల్లం : పావు కేజీ
ఉప్పు : 100 గ్రాములు
ఉప్పు : 100 గ్రాములు
చింతపండు : పావు కేజీ
నూనె : పావు కేజీ
ఎండుమిర్చి : పావు కేజీ
ఎండుమిర్చి : పావు కేజీ
వెల్లుల్లి : 100 గ్రాములు
పోపు దినుసులు : కొద్దిగా
పోపు దినుసులు : కొద్దిగా
తయారు చేయు విధానం :
అల్లంఫై పొట్టు తీసి కడిగి శుభ్రంగా తుడిచి, ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. అస్సలు తడి లేకుండా చూడాలి. ఇప్పుడు నూనెలో వేపిన ఎండుమిర్చి, అల్లం, బెల్లం, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి. అస్సలు నీరు తగలకూడదు. (తడి తగిలితే పచ్చడి పాడయిపోతుంది). ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడిచేసి పోపు దినుసులు వెయ్యాలి, అవి వేగాక కరివేపాకు వేసి రుబ్బిన పచ్చడిని వేసి కలిపి స్టవ్ ఆపాలి. కావాలంటే పోపులో కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు.
