కావలసిన పదార్ధాలు :
మినప పప్పు : అరకేజీ
పచ్చిమిర్చి : ఆరు
ఉల్లిపాయలు : రెండు [కావాలంటే]
ఉప్పు : సరిపడ
నూనె : అరకేజీ
వంటసోడా : చిటికెడు
తయారుచేయు విధానం :
మూడు గంటల ముందు పప్పు నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని పప్పులో కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడి.

