బాదం జీడిపప్పు బర్ఫీ (Preparation of Almond Cashew Burfi / Badam Jeedipappu Burfi)

కావలసిన పదార్ధాలు :

జీడిపప్పులు : రెండు కప్పులు
బాదం పప్పులు : రెండు క ప్పులు
పంచదార : రెండు కప్పులు
యాలకుల పొడి : 1 టి స్పూన్
నెయ్యి : 1  కప్పు


తయారు చేయు విధానం :

బాదంలు రాత్రి నానపెట్టి పొట్టు తీసి, జీడిపప్పులు బాదంపప్పులు కలిపి రెండు గంటలు నీటిలో నానపెట్టాలి. ఇప్పుడు వీటిని మెత్తగా రుబ్బాలి. స్టవ్ వెలిగించి వెడల్పు పాన్లో పంచదార, కొద్దిగా నీరు పోసి పాకం పట్టాలి. తీగ పాకం రాగానే రుబ్బిన పిండి వేసి కలపాలి. పది నిముషాలకి పాకం చిక్క పడుతుంది. ఇప్పుడు యాలకులపొడి, నెయ్యి వేసి కలపాలి, బాగా కలిసి ముద్దలా వచ్చాక ప్లేటుకి నెయ్యి రాసి దీనిని ప్లేటులోకి వంచి వెంటనే చపాతీ కర్రతో పలుచగా వత్తీ, చల్లారిన తరువాత ముక్కలుగా కొయ్యాలి. అంతే బాదం జీడిపప్పు బుర్ఫీ రెడి.