కావలసిన పదార్ధాలు :
రవ్వ : అరకేజీ
నెయ్యి : కప్పు
కేరెట్ : పావుకేజీ
కొబ్బరి : పెద్దది ఒకటి
పంచదార : కేజీ
యాలకుల పొడి : 1 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానం :
స్టవ్ పై కళాయిపెట్టి కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి కోరు రెండు నిముషాలు వేపాక యాలకుల పొడి వేసి పంచదారను ముడు భాగాలుగా చేసి ఒక భాగం కొబ్బరిలో వేసి కలపాలి. పది నిముషాలకు గట్టిపడి కొబ్బరిముద్దలా వస్తుంది. ఇప్పుడు మరో కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కేరెట్ కోరు వేసి రెండు నిముషాలు వేగిన తరువాత దానిలో మరోభాగం పంచదార వేసి కలపాలి, కొద్ది సేపటికి గట్టిపడి కేరెట్ ముద్దలా వస్తుంది. ఇప్పుడు వేరే కళాయిలో మిగిలిన నెయ్యి వేసి రవ్వ వేపాలి. రవ్వ వేగి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపి, వేడి రవ్వలో మిగిలిన పంచదార వేసి బాగా కలిపి మూతపెట్టాలి. రవ్వ వేడికి పంచదార కరుగుతుంది. ఇప్పుడు కేరెట్ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి కొబ్బరి ముద్దను కొంచెం చేతిలోకి తీసుకోని పలుచగా చేసి కేరెట్ ఉండను మద్యలో పెట్టి ఉండలా చుట్టాలి, అలా అన్ని ఉండలు చేసి పక్కనపెట్టాలి. ఇప్పుడు పంచదారతో కలిసిన రవ్వను బాగా కలిపి కొంచెం చేతిలోకి తీసుకోని పలుచగా చేసి, కేరెట్ ఉండతో తయారుచేసుకున్న కొబ్బరి ఉండను పెట్టి మరలా ఉండగా చుట్టాలి. అలా అన్ని ఉండలు చుట్టుకోవాలి.
