పోకుండలు (Pokundalu / Fried laddu in Telugu)

కావలసిన పదార్ధాలు :

బియ్యం : అరకిలో
బెల్లం : 300  గ్రాములు 
నూనె : అరకిలో
కొబ్బరికాయ : ఒకటి
(కొబ్బరి చిన్నచిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి)

తయారు చేయు విధానం :

1) బియ్యం రాత్రి నానపెట్టి, ఉదయం పిండి దంచాలి (మిక్సి కూడా 
    వేసుకోవచ్చు)
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్రలో బెల్లం వేసి కొద్దిగా నీరు కలిపి పాకం
    పట్టాలి.
3) ఉండపాకం వచ్చాక కొబ్బరి ముక్కలు వేసి కలిపి, పిండి పోస్తూ కలపాలి. 
    ఇలా తయారైన మిశ్రమాన్ని చలిమిడి అంటారు.
4) ఇప్పుడు స్టవ్ మీద కళాయిపెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. 
    చలిమిడిని చిన్నచిన్న ఉండలుగా చేసి కాగే నూనెలో వేసి దోరగా వేపాలి.
5) బంగారు రంగులో వేగాక తీసి చల్లారిన తరువాత డబ్బాలో పెట్టు కోవాలి.


* ఇవి పదిహేను రోజులు నిల్వ వుంటాయి.