బియ్యంరవ్వ పిట్టి (Pitti / Rava Puttu)

కావలసిన పదార్ధాలు :

బియ్యపు రవ్వ : పావుకేజీ
బెల్లం : పావుకేజీ
నెయ్యి : రెండుస్పూన్లు
కొబ్బరి కోరు : 1 కప్పు
ఉప్పు : చిటికెడు


తయారుచేయు విధానం :

1) బియ్యం కడిగి ఆరబెట్టి రవ్వగా చెయ్యాలి.
2) రవ్వను తడిపొడిగా తడిపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి 
    దానిమీద ఒక పలుచటి గుడ్డ కట్టాలి.
3) ఇప్పుడు తడిపిన రవ్వలో కొబ్బరికోరు, ఉప్పు కలిపి దీనిని గిన్నెకు కట్టిన 
    గుడ్డ మీద వేయాలి.
4) దీనిమీద  మూతపెట్టి గిన్నేను స్టవ్ మీద పెట్టాలి.
5) ఇప్పుడు గిన్నెలో నీళ్ళుమరిగి ఆవిరి వస్తుంది, ఆవిరికి గుడ్డలోవున్న రవ్వ 
    ఉడుకుడుంది. అలా పావుగంటకి రవ్వ ఉడికి పిట్టి తయారవుతుంది.
6) ఇప్పుడు స్టవ్ ఆపి గిన్నెను దించి, మూతతీసి జాగ్రత్తగా పిట్టిని ఒక 
    ప్లేటులోకి తీసుకోని దీనిలో బెల్లంకోరు, నెయ్యి కలిపి పిల్లలకు పెట్టడమే.


గమనిక : ఇది అవిరి మీద ఉడికింది కాబట్టి, పిల్లలకు  చాలా మంచిది.