కావలసిన పదార్ధాలు :
చికెన్ : అరకేజీ
చిన్నచిన ముక్కలుగా చెయ్యాలి
అల్లం, వెల్లుల్లి : ఒక టేబుల్ స్పూన్
పెరుగు : 1 కప్పు
నిమ్మరసం : 1 టి.స్పూన్
వెనిగర్ : 1 టి.స్పూన్
ఉప్పు : సరిపడా
గరం మసాల : 1 టి.స్పున్
కొత్తిమిర : కొద్దిగా
నూనె : అరకేజీ
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : ఆరు
సెనగపిండి : పావుకేజీ
తయారుచేయు విధానం :
శుభ్రం చేసిన చికెన్ లో ఉప్పు, పెరుగు, మసాల, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, నిమ్మరసం, కొద్దిగా నూనే కలిపి గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు సెనగపిండిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళుపోసి కలిపి అరగంట గడిచిన తరువాత, పక్కన పెట్టిన చికెన్లో కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె పోసి కాగనివ్వాలి, నూనె వేడిఅయ్యాక చికెన్ కలిపిన పిండిని పకోడిలా నూనెలో వేసి ఎర్రగా వేపి ఒక ప్లేటులోతియ్యలి. అంతే చికెన్ పకోడీ తయార్.
