సెనగపిండి : రెండు కప్పులు
పంచదార : కప్పున్నర
నెయ్యి : కప్పున్నర
యాలకుల పొడి : కొద్దిగా
తయారు చేయు విధానం :
స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేడిచేసి సెనగ పిండిని కమ్మని వాసన వచ్చే వరకు వేపాలి. ఇప్పుడు పంచదారను పొడి చేసి ఉంచుకోవాలి. స్టవ్ ఆపి సెనగ పిండిలో పంచదార పొడి, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి ఉండలుగా చుట్టాలి. అంతే కమ్మని సెనగ సున్నివుండలు రెడి.
