కావలసిన పదార్ధాలు :
దొండకాయలు : పావుకేజీ
ఎండుమిర్చి : ఆరు
ఎండు కొబ్బరి : చిన్న ముక్క
ఎండు కొబ్బరి : చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
ఉప్పు : తగినంత
నూనె : ఒక కప్పు
ఉప్పు : తగినంత
నూనె : ఒక కప్పు
కరివేపాకు : రెండు రెమ్మలు
పోపుదినుసులు : ఒక టి స్పూన్
పోపుదినుసులు : ఒక టి స్పూన్
తయారు చేయు విధానం :
దొండకాయలు కడిగి నిలువుగా సన్నగా కట్ చెయ్యాలి. కొబ్బరి, మిర్చి, వెల్లుల్లి, ధనియాలు కలిపి మిక్సి వేసి పొడిచేయ్యాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయిపెట్టి నూనె కాగిన తరువాత పోపుదినుసులు వేసి వేగన తరువాత దొండకాయలు కలిపి మూతపెట్టాలి. అప్పుడప్పుడు మూతతీసి కలపాలి, అలా పది నిముషాలకు దొండకాయలు వేగి
మెత్తబడతాయి, అప్పుడు మూత తీసివెయ్యాలి. ఇప్పుడు దొండకాయల్లో నీరు పోయాక పొడిచేసిన కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాలకు పొడిపొడిగా దొండకాయల వేపుడు రెడి.
