కావలసిన పదార్ధాలు :
ఎండుకొబ్బరి తురుము : 2 కప్పులు
వేపిన నువ్వులు : 2 కప్పులు
వేపిన సెనగపప్పు : 1 కప్పు
వేపిన వేరుసెనగ పప్పులు : 1 కప్పు
బెల్లం : అరకిలో
తయారుచేయు విధానం :
కొబ్బరి, వేపి సిద్దం చేసుకున్న పప్పులు, నువ్వులు, బెల్లం అన్ని కలిపి రోట్లో వేసి దంచాలి లేదా మిక్సిలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా అయ్యిన మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి పది రోజులు పైనే నిల్వ వుంటాయి.
