ఉప్మారవ్వ : పావుకేజీ
పోపుదినుసులు : కొద్దిగా
జీడిపప్పులు : అరకప్పు
జీడిపప్పులు : అరకప్పు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉల్లిపాయ : ఒకటి
ఉల్లిపాయ : ఒకటి
ఎండుమిర్చి : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం ముక్కలు : 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం ముక్కలు : 1 టేబుల్ స్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్లు
నీళ్ళు : 3 గ్లాసులు
నీళ్ళు : 3 గ్లాసులు
తయారు చేయు విధానం :
ముందుగా బాండిలో నూనె వేడి చేసి, పోపుదినుసులు వేసి వేగిన తరువాత జీడిపప్పులు వేసి వేగనివ్వాలి. దోరగా వేగాక వెండిమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు వేసి వేపాలి. అవి వేగాక కరివేపాకు వేసి కలిపి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి. రెండు నిముషాలకి నీళ్ళు మరుగుతాయి అప్పుడు రవ్వవేసి గరిటతో తిప్పాలి. ఇప్పుడు రవ్వ ఉడికి గట్టిపడుతుంది. స్టవ్ ఆపి కొత్తిమిర జల్లి, మూత పెట్టి ఒక నిముషం ఉంచాలి. అంతే గుమగుమలాడే జీడిపప్పు ఉప్మా రెడి.
