కావలసిన పదార్ధాలు :
మటన్ : అరకేజీ
గోంగూర : రెండు కట్టలు
కారం : రెండు టేబుల్ స్పూన్ లు
ఉప్పు : తగినంత
ఉల్లిపాయలు : పెద్దవి రెండు
పచ్చిమిర్చి : నాలుగు
గరంమసాల : 1 టేబుల్ స్పూన్
అల్లం-వెల్లుల్లి ముద్ద : 1 టేబుల్ స్పూన్
నూనె : 100 గ్రాములు
ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క కలిపి : ముద్దగా చెయ్యాలి.
తయారు చేయు విధానం :
మటన్ బాగా కడిగిన తరువాత కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి, ధనియాలు, మసాల ముద్ద వేసి బాగా కలిపి ఒక గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కొద్దిగా కాగిన తరువాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి, వేగాక నానపెట్టిన మటన్ని వేసి మూతపెట్టి చిన్నమంట (సిం) పై వుడకనివ్వాలి. ఇప్పుడు గోంగూర కడిగి వుడకపెట్టి మెత్తగా చేసి పక్కన పెట్టాలి. మటన్ ఉడికి నూనె పైకి తేలితే గరం మసాల వేసి కలపాలి, ఇప్పుడు మెత్తగా చేసిన గోంగూర వేసి బాగా కలపి ఒక నిముషం వుంచి స్టవ్ ఆపాలి. అంతే మటన్-గోంగూర కూర రెడి.