కలాకంద్ (How to prepare Kalakand in Telugu Language)

కావలసిన పదార్ధాలు :


పాలు : 1 లీటరు
పంచదార : అరకేజీ
నెయ్యి : పావు కప్పు (50 Grms)






తయారు చేయు విధానం :

పాలు కాచి, దానిలో నిమ్మరసం పిండితే పాలు విరుగుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పంచదార లేతపాకం వచ్చాక దానిలో విరిగిన పాలను వేసి బాగా కలపాలి. పాకం కాస్త గట్టిపడ్డాక నెయ్యి వేసి కలిపి, ప్లేటుకి నెయ్యి రాసి పాకాన్ని ప్లేటులోకి వంచి సమంగా చేసి, ఆరిన తరువాత ముక్కలుగా కోసుకోవాలి. ప్లేటులోకి వేసినప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడే సిల్వర్ ఫాయిల్  అద్దితే బాగుంటుంది. అంతే కలాకంద రెడి.