బూంది లడ్డు (How to prepare Boondi Laddu)

కావలసిన పదార్ధాలు :

శెనగపిండి : పావు కిలో
డాల్డా : పావు కిలో
పంచదార : అర కిలో
మిటాయి రంగు : చిటికెడు 
కిసుమిసు, జీడిపప్పు : సరిపడ
పచ్చ కర్పూరం : చిటికెడు


తయారు చేయు విధానం : 

శెనగపిండిని జల్లించి నీరుపోసి దోసెల పిండిలా కలపాలి. స్టవ్ వెలిగించి  వెడల్పు పాత్రలో పంచదార, కొద్దిగా నీరు పోసి కరగనివ్వాలి. ఇప్పుడు మరో   స్టవ్ వెలిగించి బాండిపెట్టి డాల్డా వేసి, కాగిన తరువాత జీడిపప్పులు దోరగా వేపి తియ్యాలి, చిల్లుల గరిటె తీసుకొని కలుపుకున్న శెనగపిండిని గరిటె పై వేసి చేతితొ తిప్పితే బూందిలా బాండిలో పడుతుంది.

పంచదార తీగపాకం వచ్చాక స్టవ్ ఆపి, వేగిన బూందిని పాకంలో వెయ్యాలి.  అలా శెనగపిండి మొత్తం అయిపోయాక పాకంలో జీడిపప్పులు, కిసుమిసు,  మిటాయి రంగు, కర్పూరం వేసి బాగాకలిపి మనకు నచ్చినట్టు ఉండలు చుట్టుకోవడమే. అంతే బూంది లడ్డు రెడి.