కావలసిన పదార్ధాలు :
సొరకాయ కోరు : ఒక కప్పు
సగ్గు బియ్యం : ఒక కప్పు
పంచదార : రెండు కప్పులు
నెయ్యి : ఒక కప్పు
జీడిపప్పులు, కిస్మిస్లు, బాదంలు : ఒక కప్పు
యాలుకల పొడి : స్పూన్ ,
నచ్చిన కలరు : చిటికెడు
తయారు చేయు విధానం :
సొరకాయను చెక్కు తీసి కోరి పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సగ్గుబియ్యంలో రెండు కప్పుల నీళ్లుపోసి ఉడికించాలి, మెత్తగా ఉడికి చిక్కగా వచ్చాక పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు, బాదంలు వేసి దోరగా వేపి పక్కన పెట్టాలి, అదే బాండిలో కాస్త నెయ్యి వేసి సొరకాయ కోరు వేసి, పచ్చి వాసన పోయే వరకు వేపి దానిలో సగ్గుబియ్యం ముద్ద, పంచదార వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. పంచదార కరిగి హల్వా దగ్గరకు వచ్చాక మిగిలిన నెయ్యి, వేపిన జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్లు, యాలుకలపొడి, నచ్చిన కలరు వేసి బాగా కలిపి స్టవ్ ఆపి ప్లేటుకి నెయ్యి రాసి దానిలోకి వంచి సరి చెయ్యాలి, అంతే స్పూన్ తో తినవచ్చు లేదా చల్లారిన తరువాత ముక్కలుగా కోసి తినవచ్చు అంతే, సొరకాయ హల్వా రెడి.
