కావలసిన పదార్ధాలు :
మినపప్పు : పావు కేజీ
బియ్యం : పావు కేజీ
పచ్చి శెనగపప్పు : రెండు కప్పులు
పచ్చి శెనగపప్పు : రెండు కప్పులు
బెల్లం : పావు కేజీ
నూనె : అరకేజీ
యలుకులు పొడి రెండు స్పూన్ లు
తయారు చేయు విధానం :
మూడు గంటలు ముందు పప్పు నానపెట్టాలి, నానిన తరువాత బాగా కడిగి దానిలో బియ్యం పోసి ఒక గంట నానబెట్టి మెత్తగా రుబ్బాలి, పచ్చి శెనగపప్పు కుక్కరలో వేసి నీరుపోసి స్టవ్ మీద పెట్టాలి, మూడు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపి, కుక్కర్ అవిరిపోయాక మూతతీసి నీరు వుంటే వంచి, మళ్ళి స్టవ్ పై కుక్కరు పెట్టి శెనగపప్పులో బెల్లం కోరు వేసి వుడకనివ్వాలి. బాగా ఉడికి గట్టిగా ముద్దగా వస్తుంది. యాలుకలపొడి కలిపి చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండలుగా చేసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై నూనెపెట్టి వేడి చెయ్యాలి. ఇప్పుడు ఒకొక్క ఉండను రుబ్బిన పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి వేగనివ్వాలి, మాడకుండా బంగారు రంగులోకి వచ్చాక తీసి ప్లేటులోకి తీసుకోవాలి. అంతే పూర్ణం బూరెలు తినటానికి రెడీ.