టమాట చెట్నీ (Tomato chutney for Breakfast)

కావలసిన పదార్ధాలు :

టమాటాలు : పావు కేజీ
పచ్చిమిర్చి : పదిహేను
అల్లం : చిన్నముక్క
జీలకర్ర : ఒక స్పూన్
వెల్లుల్లిపాయ (కావాలంటే) : చిన్నది
ఉప్పు : తగినంత 
పోపుదినుసులు, కరివేపాకు : కొద్దిగా


తాయారు చేయు విధానం :

స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేపాలి. వేగాక అవి తీసి పక్కన పెట్టి అదే నూనెలో టమాట ముక్కలు వేసి నీరు విగిరి పోయాక నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపి చల్లారిబెట్టాలి. 


ఇవి చల్లారేలోపు, వేపిన పచ్చిమిర్చి మిశ్రమం మిక్స్హీలో వేసి ఒకసారి మిక్సి పట్టాలి. తరువాత చల్లారిన టమాటాలు వేసి మిక్సి వేస్తె టమాట పచ్చడి రెడి, ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేగాక, మిక్సి పట్టిన పచ్చడి వెయ్యాలి. అంతే టమాట పచ్చడి రెడి.